కళాతపస్వి జీవితానికి దృశ్యరూపం

Saturday,July 28,2018 - 11:03 by Z_CLU

టాలీవుడ్ లో బయోపిక్ సీజన్ నడుస్తుంది. మహానటి సినిమా సక్సెస్ తరవాత యంగ్ డైరెక్టర్స్ కాన్సంట్రేషన్ బయోపిక్స్ పై మళ్ళింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న NTR బయోపిక్ ఆల్రెడీ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఇదే వరసలో సీనియర్ డైరెక్టర్ కళాతపస్వి K. విశ్వనాథ్ బయోపిక్ తెరకెక్కనుంది.

గురుపౌర్ణిమ సందర్భంగా నిన్న K. విశ్వనాథ్ బయోపిక్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.  జనార్ధన మహర్షి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘విశ్వ దర్శనం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.

ఈ సినిమాలో విశ్వనాథ్ గారి పాత్రలో కనిపించనున్న స్టార్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ డీటేల్స్ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. వచ్చే నేలనుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాని T.G. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.