స్టార్ హీరోయిన్... ఒకే ఒక్క సినిమా

Sunday,March 31,2019 - 12:01 by Z_CLU

స్టార్ హీరోయిన్స్ అందరూ రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుంటే సమంత మాత్రం ఒకే ఒక్క సినిమా చేయబోతుంది. అవును సమంత చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది. అదే ’96’ రీమేక్.  లేటెస్ట్ గా తమిళ్ సినిమా ‘సూపర్ డీలక్స్’ లో వ్యాంప్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో భర్త నాగచైతన్య తో కలిసి ‘మజిలీ’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మజిలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్న సమంత త్వరలోనే ’96’ రీమేక్ సినిమాలో నటించనుంది.

అయితే నెక్స్ట్ లిస్టులో కేవలం ఒకే ఒక్క సినిమా ఉండడంపై ఇటివలే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది సమంత… సూపర్ డీలక్స్ లో చేసిన క్యారెక్టర్ కి క్రిటిక్స్ నుండి కూడా అభినందనలు లభించాయని, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంకా చేయాలనుందని, అందువల్లే రెగ్యులర్ క్యారెక్టర్స్ కి నో చెప్తున్నానని చెప్పుకొచ్చింది.

సో క్యారెక్టర్స్ బట్టే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న సామ్ ’96’ లో త్రిష చేసిన క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులను ఏ మేరకూ మెప్పిస్తుందో..? చూడాలి.