మరో ఛాన్స్ ఇచ్చాడు

Sunday,March 31,2019 - 11:02 by Z_CLU

దాదాపు ఏడు నెలల నుండి నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా  ఫ్యాన్స్ ని వెయిట్ చేయించిన నితిన్ వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు. మొన్నీ మధ్యే చంద్రశేఖర్ ఏలేటి తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన నితిన్ తన పుట్టిన రోజు సందర్భంగా మరో 2 సినిమాలను అనౌన్స్ చేసాడు. అందులో ఒకటి వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘భీష్మ’ కాగా మరొకటి కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా.

చంద్ర శేఖర్ ఏలేటి , వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు నితిన్. కానీ కృష్ణ చైతన్య తో నితిన్ కి రెండో సినిమా.. లేటెస్ట్ గా ఈ డైరెక్టర్ తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా చేసాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు.

‘ఛల్ మోహన్ రంగ’ సినిమాను త్రివిక్రమ్ అందించిన కథ -స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన కృష్ణ చైతన్య ఇప్పుడు నితిన్ కోసం తనే స్వయంగా ఓ కథను సిద్దం చేసుకున్నాడు.  ఈ సినిమాను సొంత బ్యానర్ లోనే చేయబోతున్నాడు నితిన్. అక్టోబర్ లేదా నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి నితిన్ ఇచ్చిన రెండో అవకాశాన్ని ఈ డైరెక్టర్ ఎలా ఉపయోగించుకుంటాడో..చూడాలి