ఒక్క మెట్టు దూరంలో...?

Sunday,September 25,2016 - 12:18 by Z_CLU

ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు మారుతి. ఇతడికంటూ ఇప్పుడు ఓ మార్కెట్ క్రియేట్ అయింది. అన్నింటికీ మించి బడా హీరో వెంకటేష్ తో ఓ సినిమా చేయడం మారుతి కెరీర్ కు ప్లస్ అయింది. వెంకీ-మారుతి కాంబినేషన్ లో వచ్చిన బాబు బంగారం సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో మారుతికి మరోసారి డిమాండ్ పెరిగింది. వరుసగా 2 హిట్స్ అందుకున్న మారుతి… ఇప్పుడు మెగా కాంపౌండ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మారుతి దగ్గర 2 కథలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఏ కథ నచ్చితే ఆ కథతో మెగా హీరోల్లో ఒకరితో సినిమా చేయాలనేది మారుతి ప్లాన్. కెరీర్ స్టార్టింగ్ నుంచి బన్నీ, అల్లు అరవింద్ కు మారుతి చాలా క్లోజ్. ఆ పరిచయం ఇప్పుడు పనికొస్తుందేమో చూడాలి. మొత్తానికి బంగారం లాంటి అవకాశానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నాడట ఈ హిట్ దర్శకుడు. మరి ఆ మెగా హీరో ఎవరనేది త్వరలోనే తేలిపోతుంది.