ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ !

Tuesday,September 13,2016 - 04:10 by Z_CLU

తాజాగా ‘జనతా గ్యారేజ్’ తో గ్రాండ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాకు కాస్త విరామం తీసుకుంటున్నాడు. ఇక వక్కంతం తో పాటు పూరి తో కూడా తారక్ ఓ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకూ తన తదుపరి సినిమాను అనౌన్స్ చెయ్యలేదు యంగ్ టైగర్. కాక పోతే తమ్ముడి తో ఓ సినిమా చేయబోతున్నట్లు తారక్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించాడు కళ్యాణ్ రామ్.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘బాక్సర్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట కళ్యాణ్ రామ్. మరి ఈ టైటిల్ తోనే తారక్ తో సినిమా చేస్తాడా? లేక తన కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడా?అనేది తెలియాల్సి ఉంది. ఒక వేల ఈ టైటిల్ తారక్ కోసం అయితే ఈ సినిమాకు దర్శకుడెవరన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..