పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన సమంత ?

Tuesday,September 13,2016 - 02:40 by Z_CLU

గత కొన్ని నెలలుగా అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య , టాలీవుడ్ బ్యూటీ సమంత ల ప్రేమాయణం పై జోరు గా ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవలే వీరిద్దరి ప్రేమ ను అంగీకరిస్తున్నట్లు త్వరలోనే పెళ్లి జరిపించనున్నట్లు ప్రకటించాడు నాగ్. కానీ పెళ్లి తేదీ పై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు కింగ్. ఇక చైతు, సమంత ల పెళ్లి ఎప్పుడు ? ఎక్కడ జరగనుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. తాజాగా వీరిద్దరి పెళ్లి వేదిక ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

సమంత పుట్టి పెరిగింది చెన్నై లోనే కాబట్టి పెళ్లి కూడా అక్కడ జరగాలని ఆశిస్తుందట. ఈ విషయాన్ని ఇటీవలే నాగ్, చైతులకు చెప్పిందట. ఇందుకు వారిద్దరూ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ పెళ్లి వేడుక ను భారీ ఎత్తు న ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున. ఇక త్వరలోనే ఈ వేదిక తో పాటు పెళ్లి తేదీ ను కూడా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.