దసరా కి 'శాతకర్ణి' ?

Wednesday,September 14,2016 - 07:00 by Z_CLU

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెలుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రారాజు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి గా బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి కి ఇంకా చాలా నెలలు ఉండడం తో దసరా కానుకగా నందమూరి అభిమానుల కోసం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నాడట బాలయ్య.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అరుదైన సినిమాగా నిలవనుందని అంటున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రియ శ‌ర‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు యూనిట్.ఈ షెడ్యూల్ తో సగ భాగం పైనే చిత్రీకరణ పూర్తి కానుందని సమాచారం.