ఆర్-ఆర్-ఆర్ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్

Monday,January 21,2019 - 11:55 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్-ఆర్-ఆర్ సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఈరోజు పొద్దున్నే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. క్లాప్ బోర్డ్ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన యూనిట్, సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైందనే విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆర్-ఆర్-ఆర్ సినిమా. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోయిన్లు ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన యూనిట్.. సెకెండ్ షెడ్యూల్ లో కూడా హీరోయిన్ల పై క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో కనిపించడం లేదు. ఒక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను అనుకుంటున్నారు కానీ అది కూడా పక్కా కాదు.

మరోవైపు ఈ సినిమా కోసం మరోసారి బల్కీగా తయారవుతున్నాడు ఎన్టీఆర్. మొన్నటివరకు కాస్త స్లిమ్ గా ఉన్న యంగ్ టైగర్, ఆర్-ఆర్-ఆర్ లో మేకోవర్ కోసం కాస్త లావెక్కాడు. కొత్త గెటప్ తో మొన్ననే మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా వచ్చాడు.