"ప్రేమ‌క‌థాచిత్రమ్ 2" రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,January 21,2019 - 12:04 by Z_CLU

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో ఆకట్టుకున్న RPA క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2. హ‌రి కిషన్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 22న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న నందిత శ్వేత ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,
ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి
సంగీతం – జె.బి
డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
పీఆర్వో – ఏలూరు శ్రీను
ఆర్ట్ – కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు – హరి కిషన్