ఎన్టీఆర్ , చరణ్... ముందెవరితో ?

Sunday,November 26,2017 - 10:50 by Z_CLU

కేవలం మూడు సినిమాలతోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న కొరటాల శివ ప్రెజెంట్ మహేష్ తో ‘భారత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల ఓ సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ కాంబినేషన్ లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు కొరటాల. ఈ సినిమాను రామ్ చరణ్ తన ఓన్ బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు.

ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల.. తారక్ కోసం ఓ స్టోరీ రెడీ చేసే పనిలో పడ్డాడు… అలాగే చరణ్ తో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్న కొరటాల ఫైనల్ గా చరణ్  కి  ఓ స్క్రిప్ట్ నరేట్ చేసి స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. ఈ ఇద్దరూ ఫిక్స్ కనుక ఈ హీరోల్లో ఎవరితో కొరటాల  ముందు సినిమా చేస్తాడన్న దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంటుంది. మరి ఎన్టీఆర్ – చరణ్ లలో కొరటాల ముందుగా చేయబోయే సినిమా ఎవరిదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.