ఎన్టీఆర్ హీరోయిన్ తో రామ్ ?

Sunday,November 26,2017 - 10:02 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే కొన్ని కథలు విన్న రామ్ ఫైనల్ గా త్రినాధ్ రావు డైరెక్షన్ లో  సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం లేటెస్ట్ గా ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన నివేత థామస్ ను హీరోయిన్ గా  సెలెక్ట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ – మాటలు అందిస్తున్నాడని, ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్  జరుగుతుందని సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవ్తుంది యూనిట్.