శర్వానంద్ సినిమాకు లక్కీ బ్యూటీ ఫిక్స్...

Sunday,November 26,2017 - 12:06 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న శర్వానంద్ హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. మొన్నటి వరకూ ఈ సినిమాలో శర్వా సరసన లక్కీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపించగా యూనిట్ మాత్రం ఈ విషయం పై స్పందించలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ బ్యూటీ నే సినిమాకు ఫిక్స్ చేసారని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించనున్నారని సమాచారం.

కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ వస్తున్న హను ఈ సినిమాలో సాయి పల్లవి ని మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 20 నుంచి నేపాల్ లో షూటింగ్ జరుపుకోనుంది.