నిజం ఒప్పుకున్న యంగ్ టైగర్

Thursday,October 06,2016 - 01:32 by Z_CLU

వరుస  విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన మనసులోని మాట బయట పెట్టాడు. హాజరవుతున్న అన్ని ఫంక్షన్లలో  తన స్పీచ్ తో ఆకట్టుకుంటున్నాడు తారక్.  తాజాగా కళ్యాణ్ రామ్  ‘ఇజం’ ఆడియో కు ముఖ్య అతిధిగా హాజరైన ఎన్టీఆర్… పూరి గురించి తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు.

dsc_00980093

           వరుస అపజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న ఎన్టీఆర్ ను ‘టెంపర్’ తో మళ్ళీ ట్రాక్ లో పెట్టింది దర్శకుడు పూరి అనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ కూడా అదే చెప్పాడు. “జగన్ గారితో  ‘టెంపర్’ సినిమా చెయ్యక ముందు నేనొకటి.   చేసిన తరువాత నేనొకటి.  ఈరోజు నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరగడానికి, నటుడిగా ఏదో సాధించాలి అనే తపన పెరగడానికి కారణం టెంపర్ సినిమానే. ఆ సినిమా రూపంలో పూరీగారు నాలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు”.  అని తన మనసులో మాట బయటపెట్టాడు యంగ్ టైగర్.