క్లైమాక్స్ షూటింగ్ లో రోబో

Thursday,October 06,2016 - 04:37 by Z_CLU

రజినీకాంత్ రోబో 2.0 ఇప్పటికి 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. 350 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఇప్పటికీ 150 రోజులు. ఈ విషయం స్వయంగా ఆ సినిమా డైరెక్టర్ శంకర్ ట్వీట్ చేశాడు.

గతేడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు రోబో సినిమా యూనిట్ 150 రోజులు షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం జరుగుతున్న క్లయిమాక్స్ షూటింగ్ ఫైట్ మాస్టర్ సిల్వ అధ్వర్యంలో జరుగుతుంది.

rajinikanth-robo-release-date

ఈ షెడ్యూల్ లో క్లయిమాక్స్ సీక్వెన్స్ తో పాటు రజనీకాంత్, హీరోయిన్ ఎమీ జాక్సన్ కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ని కూడా తెరకెక్కించనున్నారు. ఇంకా 40% షూటింగ్ పూర్తవ్వగానే పూర్తిగా గ్రాఫిక్ వర్క్ పై కాన్సంట్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్న శంకర్, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో రోబో 2.0 ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.