ఫాస్ట్ ఫేజ్ లో 'శ్రీనివాస కళ్యాణం'...ఆగస్ట్ లో రిలీజ్

Sunday,May 27,2018 - 10:54 by Z_CLU

నితిన్ – సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ జూన్ ఫస్ట్ వీక్ నుండి అమలాపురంలో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.

దాదాపు 20 రోజుల పాటు జరగనున్న షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు మరికొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నారు. గతంలో ‘శతమానం భవతి’ సినిమాలాగే ఈ సినిమాను కూడా అనుకున్న టైం కే ఫినిష్ చేసి థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

నితిన్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత కీ రోల్ ప్లే చేస్తుంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు మిక్కీ జే.మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పెళ్లి చుట్టూ జరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాను శ్రావణమాసంలో ఆగస్ట్ 9న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు దిల్ రాజు.