రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'నా నువ్వే '

Sunday,May 27,2018 - 10:02 by Z_CLU

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా తెరకెక్కిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నా నువ్వే` రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. జ‌యేంద్ర డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను జూన్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మహేశ్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి నిర్మించిన ఈ సినిమాకు పీ.సి.శ్రీరాం సినిమాటోగ్రాఫర్. శ‌ర‌త్ సంగీతం అందించాడు.