నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ?

Sunday,May 27,2018 - 11:20 by Z_CLU

‘సాక్షం’ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొత్త దర్శకుడు శ్రీనివాస్ తో మరో సినిమాను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు సంపత్ నందితో మరో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా సంపత్ నంది చెప్పిన కథ నచ్చడంతో ఈ హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని… ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడని సమాచారం. మరి త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారు మేకర్స్.