టీజర్ తో నితిన్ రెడీ

Tuesday,February 13,2018 - 12:35 by Z_CLU

‘ఛల్ మోహన్ రంగ ‘ అంటూ టీజర్ తో హంగామా చేయడానికి రెడీ అయ్యాడు నితిన్. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఛల్ మోహన్ రంగ ‘ టీజర్ ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ అందించాడు. శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ఎన్. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.

నితిన్ కు ఇది 25 వ సినిమా. ప్రస్తుతం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నారు.