సెన్సార్ క్లియర్ చేసుకున్న కణం

Tuesday,February 13,2018 - 03:00 by Z_CLU

నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన కణం ఫిబ్రవరి 23 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా అల్టిమేట్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ క్లియర్  అయింది.  ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ పొందింది.

రీసెంట్ ‘ఛలో’తో హిట్ కొట్టిన నాగశౌర్య ఇందులో హీరోగా నటించాడు. ఫిదా, MCA సినిమాలతో యూత్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇప్పటివరకు లవ్ ఎంటర్ టైనర్స్ తో మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి కరియర్ లో, ఈ సినిమా ఓ డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోనుంది.

A.L. విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో N.V. ప్రసాద్ సమర్పిస్తున్నారు.