మరో మూవీ ఫిక్స్

Thursday,October 06,2016 - 12:25 by Z_CLU

మొత్తానికి నితిన్ సిన్మా కన్ఫం అయిపోయింది. ఇండస్ట్రీలో హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ కి నెక్స్ట్ వర్షన్ లా ఒకేసారి రెండేసి సినిమాలు అనౌన్స్ చేస్తుంటే  నితిన్ అ..ఆ.. తరవాత తన తరవాతి సినిమా విషయంలో అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేదు. ఏదైతేనేం మన హీరో లేటుగా అయినా తన నెక్స్ట్ సినిమాని గ్రీన్ సిగ్నల్ చేసేశాడు.

హను రాఘవపూడి దర్శకత్వంలో ఫారిన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని గతంలో దూకుడు, రీసెంట్ గా హైపర్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, మరియు అనిల్ సుంకర  నిర్మిస్తున్నారు.

nithi-openinmg

        మంచి రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ సినిమాని యు.యస్. లేదా యూరోప్ దేశాల్లో చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. నవంబర్ మూడో వారం కల్లా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అ..ఆ.. లో రాముడు మంచి బాలుడు లాంటి పాత్రలో ఎట్రాక్ట్ చేసిన నితిన్ మరి ఫారిన్ కంట్రీస్ లో ఏం చేయనున్నాడో ప్రస్తుతానికి సస్పెన్సే.