సెట్స్ పైకి రాని కొత్త సినిమా

Wednesday,October 05,2016 - 01:09 by Z_CLU

అ..ఆ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ సినిమా లాంగ్ రన్ కూడా పూర్తయింది. అయినా నితిన్ ఇంకా ఖాళీగానే ఉన్నాడు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసిన నితిన్.. ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడేమో అని చాలామంది భావించారు. కానీ అ.ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు నితిన్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

nithin-stills-from-a-aa-movie-02-1

హను రాఘవపూడి సినిమాకు సంబంధించి ఇంకా లొకేషన్లు ఫిక్స్ చేయలేదు. కథ ప్రకారం.. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో 90శాతం షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఆ లొకేషన్లు వెదికి, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేసరికి… నవంబర్ వచ్చేసుందట. సో… నవంబర్ నుంచే నితిన్ సెట్స్ పైకి వెళ్తాడన్నమాట. అయితే ఈ గ్యాప్ లో మరో పని చేస్తున్నాడు నితిన్. కొంతమంది దర్శకులు చెప్పిన కథలు వింటున్నాడు. తనకు నచ్చిన మంచి కథల్ని పెండింగ్ లో పెడుతున్నాడు. హను సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఆ కథల్లోంచి ఓ సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ సూపర్ హిట్ హీరో.