మరో ఫ్యామిలీ మల్టీస్టారర్ ?

Thursday,October 06,2016 - 10:00 by Z_CLU

 అక్కినేని హీరోలకు కలకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అలాంటి సినిమాలు నందమూరి హీరోల నుంచి, మెగా కాంపౌండ్ నుంచి, ఘట్టమనేని స్టార్స్ నుంచి కూడా వస్తే బాగుంటుందని అభిమానులంతా ఆశపడ్డారు. కానీ సరైన కథలు వర్కవుట్ కాక హీరోలెవరూ ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. అయితే ఫ్యామిలీ మల్టీస్టారర్ టాపిక్ మరోసారి తాజాగా తెరపైకొచ్చింది.

  mahesh-babu

    ఘట్టమనేని వంశంలో కృష్ణ, మహేష్ బాబు, నరేష్, సుధీర్ బాబు, గౌతమ్ కృష్ణ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని ప్రతి అభిమాని కోరుకుంటాడు. ఇప్పటికే సినిమాలు ఆపేసిన నమ్రత కూడా అందులో నటిస్తే ఇంకా బాగుంటుందని చాలామంది ఫీలవుతారు. అలాంటివాళ్ల కోసమే ఓ కథ సిద్ధచేశాడట మెహర్ రమేష్. ఈమధ్య మహేష్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్న మెహర్… మనం టైపు కథను మహేష్ కు వినిపించాడని టాక్.