సర్ ప్రైజ్ చేయనున్న అల్లు అర్జున్

Monday,August 14,2017 - 03:33 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 18 నుండి బిగిన్ కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది ఉంది సినిమా యూనిట్. అయితే బన్ని ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మాత్రం, రేపు ఇండిపెండెన్స్  డే  సందర్భంగా  సినిమా యూనిట్ చేయబోయే సర్ ప్రైజ్ పైనే ఉంది. ఆ సర్ ప్రైజ్ ఏమిటన్నది రేపటికల్లా తెలిసిపోతుంది.

 

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రియల్ 27 ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తుండగా, శరత్ కుమార్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు, నాగబాబు సమర్పిస్తున్నాడు.