హీరో నితిన్ ఇంటర్వ్యూ

Friday,March 30,2018 - 10:02 by Z_CLU

నితిన్ ‘ఛల్ మోహన రంగ’ ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది.  ఈ రోజు తన 35  వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్న  నితిన్, నెక్స్ట్ వీక్ రిలీజవుతున్న  ‘ఛల్ మోహన రంగ’ సినిమా గురించి  ఇంట్రెస్టింగ్  విషయాలు షేర్   చేసుకున్నాడు  అవి మీకోసం…

అలా జరిగింది…

ఈ సినిమా కథ ‘లై’ సినిమా కన్నా ముందే డిస్కస్ చేసుకున్నాం. ఒక యాక్షన్ సినిమా తరవాత ఈ సినిమా చేయాలని ముందే అనుకున్నాం…

అందుకే త్రివిక్రమ్ చేయలేదు…

ఈ సినిమా చేస్తే ఇప్పుడే చేయాలి. ఇంకో 2 ఇయర్స్ తరవాత అయితే వర్కవుట్ కాదు. ఈ పరిస్థితుల్లో త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయడం కుదరదు. అందుకే కృష్ణ చైతన్య చేశాడు. కథ ఒకటే త్రివిక్రమ్ గారిది. తక్కిన స్క్రీన్ ప్లే దగ్గరినించి డైలాగ్ టు డైలాగ్ కృష్ణ చైతన్య దే…

అందుకే ఆయన రాలేదు…

త్రివిక్రమ్ గారికి ఆరోగ్యం బాగా రాకపోవడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. అక్కడికీ ఆయన లాస్ట్ మూమెంట్ వరకు రావడానికే ట్రై చేశారు. కానీ గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఉండటం వల్ల, మాట్లాడటం కూడా కుదరదు. అందుకే డ్రాప్ అయ్యారు…

హ్యాప్పీ మూవీ…

నా కరియర్ లో  ఫుల్ టూ కామెడీ సినిమా అంటే ‘గుండె జారి గల్లంతయ్యిందే..’. ఆ సినిమా తరవాత మళ్ళీ అదే రేంజ్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ఉండే సినిమా ఇదే. కంప్లీట్ సినిమా ఎనర్జిటిక్ గా, ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ 15 మినట్స్ హార్ట్ టచింగ్ ఇమోషన్, సెంటిమెంట్ ఉంటుంది…

ఆ ఆలోచన డైరెక్టర్ దే…

‘పెద్దపులి’ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ ఐడియా డైరెక్టర్ దే. హీరో కి U.S. వీసా వచ్చిన ఊపులో, ఇక ‘నేనే పెద్దపులి’ అని జోష్ లో ఉండే సాంగ్ అదీ. అంత ఊపులో U.S. కి వెళ్ళాక అక్కడ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా ఏమీ ఉండదు.. అక్కడే చాలా కామెడీ జెనెరేట్ అవుతుంది…

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో హీరో ఆంబిషన్… U.S. కి వెళ్ళాలి. డబ్బు సంపాదించాలి.. కార్లు కొనాలి… అస్తమానం అదే ఆలోచనతో ఉంటాడు.

ఇమోషనల్ మూమెంట్…

సినిమా అంతా ఓకె అయ్యాక పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ఇలా ‘25 వ సినిమా నాన్న ప్రొడ్యూస్ చేస్తున్నారు’ అని చెప్పినప్పుడు, ఆయన సడెన్ గా… ‘అదేంటి నేను చేయకూడదా..? నేను కూడా ప్రొడ్యూస్ చేస్తా…’ అన్నప్పుడు షాకయ్యా. నా సినిమాకి త్రివిక్రమ్ గారు స్టోరీ ఇవ్వడమే గ్రేట్. ఇంకా ఆ ఫీల్లోంచి బయటికి కూడా రాలేదు. అంతలో పవన్ కళ్యాన్ గారు ఈ మాటనేసరికి ఇమోషనల్ అయిపోయా…

 

అంత ఆశ లేదు…

సినిమాలో పవన్ కళ్యాన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే ఎక్కువే. ఇంకా గెస్ట్ రోల్ అడిగితే అత్యాశే అవుతుంది. ఆయన ఈ సినిమాలో ఉండరు.. కానీ ఉంటారు.. అది మీరు సినిమా చూస్తే తెలిసిపోతుంది…

అది మాత్రం కన్ఫమ్…

ఈ సినిమా అటు త్రివిక్రమ్, ఇటు పవన్ కళ్యాన్ గారి పేరును నిలబెడుతుంది అది మాత్రం కన్ఫం…

పవన్ కళ్యాన్ ఇన్వాల్వ్ మెంట్…

పవన్ కళ్యాన్ గారు స్టోరీలో, ఫిల్మ్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ షూటింగ్ స్టేటస్ కనుక్కునే వాళ్ళు,  ఆడియో రిలీజ్ గురించి అడిగి కనుక్కునే వాళ్ళు అంతే…

నెక్స్ట్ సినిమాలు…

ఈ సినిమా ఇమ్మీడియట్ గా శ్రీనివాస కళ్యాణం, ఈ సినిమా తరవాత దిల్ రాజు గారి బ్యానర్ లో సినిమా ఉంటుంది. వెంకీ కుడుములతో కూడా సినిమా ఉంటుంది…

తమన్ సినిమాకి లైఫ్…

తమన్ మ్యూజిక్ సినిమాకి లైఫ్. సాంగ్స్ కన్నా రీ రికార్డింగ్ ఇంకా అద్భుతంగా చేశాడు. నాకు ఈ సినిమాలో ‘వారం’ సాంగ్ తో పాటు వెరీ వెరీ స్యాడ్ సాంగ్ చాలా ఇష్టం.

పెళ్ళి గురించి…

ప్రస్తుతానికి 100% సింగిల్.. ఇంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు…

నో ఎక్స్ పెరిమెంట్స్…

ప్రస్తుతానికి ఎక్స్ పెరిమెంట్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నా… ఈ సినిమా లవ్ బేస్డ్, అలాగే నెక్స్ట్ సినిమా కంప్లీట్ గా పెళ్ళి గురించే… ఆ తరవాత కూడా అంతే… ప్రస్తుతం ఉన్న లిస్టులో నో ఎక్స్ పెరిమెంట్స్… ఈ సినిమాల తరవాత ఆలోచిస్తా…

 

హరీష్ శంకర్ సినిమా…

హరీష్ శంకర్ గారితో సినిమా జూన్, జూలై ఆ టైమ్ లో సెట్స్ పైకి వస్తుంది…

స్క్రిప్ట్ మ్యాటర్స్…

నన్ను నేను అప్ డేట్ చేసుకోవడానికి స్పెషల్ గా ఏమీ చేయను. స్క్రిప్ట్ ని నమ్ముకుంటాను. దాన్ని బట్టే లుక్స్… ఎవ్రీ థింగ్…

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా…

‘శ్రీనివాస కళ్యాణం’ ఏప్రిల్ 17 న సెట్స్ పైకి వస్తుంది. మ్యాగ్జిమం సినిమాని జూలై 24 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం…