పవన్ కళ్యాణ్ ని ఒకసారి చూస్తే చాలనుకున్నా

Friday,March 30,2018 - 10:30 by Z_CLU

ఈ మాట అన్నది ఎవరో కాదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న నితిన్ సినిమా ‘ఛల్ మోహన్ రంగ’ డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఫస్ట్ మూవీ ‘రౌడీఫెలో’ తోనే బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు కృష్ణ చైతన్య. మళ్ళీ ఇప్పుడు తన మ్యాజికల్ స్క్రీన్ ప్లే తో, హిలేరియస్ ఎలిమెంట్స్ తో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమా కూడా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ ఉన్న కృష్ణ చైతన్య, రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ గా తన మనసులో మాట చెప్పుకున్నాడు.

“పవన్ కళ్యాన్ గారిని, త్రివిక్రమ్ గారిని దగ్గరి నుండి చూసినా చాలు అనుకునేవాణ్ణి, అలాంటిది వాళ్ళతో పని చేసే అదృష్టం దక్కింది. ఎప్పుడో గట్టిగా అనుకునే ఉంటా.. అందుకే నితిన్ కరియర్ లో ప్రెస్టీజియస్ మూవీ, 25 వ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం లభించింది. ఈ సినిమా ప్రాసెస్ లో ప్రతి ఒకరి దగ్గరి నుండి చాలా నేర్చుకున్నాను..అందరికీ చాలా థాంక్స్” అని చెప్పుకున్నాడు కృష్ణ చైతన్య.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5 న రిలీజవుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.