MacherlaNiyojikaVargam యూనిక్ పాయింట్ తో

Wednesday,August 10,2022 - 04:04 by Z_CLU

We touched unique point in Macherla Niyojika Vargam says Hero Nithiin

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎస్ ఆర్ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మాచర్ల నియోజిక వర్గం’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 12న థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ , సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. రిలీజ్ కి ముందు మేకర్స్ వదిలిన కంటెంట్ చూసి ఇది పక్కా మాస్ కమర్షియల్ సినిమా అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. కానీ ఇందులో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఓ యూనిక్ పాయింట్ ఉందని అంటున్నాడు నితిన్.

‘మాచర్ల నియోజిక వర్గం’ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో వుండే కథ చాలా యూనిక్ వుంటుంది. పొలిటికల్ నేపధ్యంలో ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. కానీ మాచర్ల లో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది.

కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో తెరకెక్కిన సినిమా ఇది. నా క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఐఎఎస్ పాత్ర చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. రీసెంట్ గా నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్ టైమెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ వున్నాయి.

నా ఫ్యాన్స్ కి పండగలా వుంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆట నేనూ థియేటర్ లో ప్రేక్షకులతో చూడబోతున్నాను. ” అంటూ నితిన్ సినిమా గురించి చెప్పుకున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics