హ్యాపీ బర్త్ డే టు నితిన్

Friday,March 30,2018 - 08:45 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు యూత్ స్టార్ నితిన్. ఓవైపు పుట్టినరోజు సంబరాలు, మరోవైపు ఛల్ మోహన్ రంగ సినిమా విడుదల. ఇలా రెండు పండగలు ఒకేసారి వచ్చేశాయి. దీంతో నితిన్ కాంపౌండ్ లో ఫుల్ హంగామా నడుస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ బర్త్ డే నితిన్ కు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే జీవితంలో తనకు అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తులతో కలిసి సినిమా చేశాడు నితిన్. అదే ఛల్ మోహన్ రంగ. నితిన్ ఎంతగానో ఇష్టపడే త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తే.. నితిన్ ఆరాధ్య దైవం పవన్ కల్యాణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

అలా ఇద్దరు ఇష్టమైన వ్యక్తులతో కలిసి నితిన్ చేసిన ఛల్ మోహన్ రంగ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది. నితిన్ కు అతిపెద్ద బర్త్ డే గిఫ్ట్ ఇదే. ఈరోజు ఈ హీరో ఎన్ని సంబరాలు చేసుంటున్నప్పటికీ.. అసలైన వేడుక అప్పుడే రానుంది. ఆ రోజు కోసమే నితిన్ కూడా వెయిటింగ్.

జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ కొనసాగిస్తూనే, మాస్ సినిమాలతో కూడా మెప్పించాడు. రీసెంట్ గా అ..ఆతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్.. ఇప్పుడు ఛల్ మోహన్ రంగతో తన రికార్డును తానే బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా నితిన్ కు ప్రత్యేకంగా బర్త్ డే విశెష్ అందజేస్తోంది జీ సినిమాలు.