క్లైమాక్స్ లో నిఖిల్ ‘ముద్ర’

Saturday,October 13,2018 - 02:01 by Z_CLU

నవంబర్ లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది నిఖిల్ ముద్ర. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్, సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లేట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు.

సొసైటీలో జరుగుతున్న కొన్ని కాంటెంపరరి ఇష్యూస్, వాటి విషయంలో మీడియా రెస్పాన్సిబిలిటీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా గా కనిపించనున్నాడు. త్వరలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. స్యామ్ C.S. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా T.N. సంతోష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.