నవంబర్ ఫస్ట్ వీక్ లో సుమంత్ ‘ఇదంజగత్’

Saturday,October 13,2018 - 03:02 by Z_CLU

ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంది సుమంత్ ‘ఇదంజగత్’. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న ఫిల్మ్ మేకర్స్, సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ కాగానే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనే ప్రాసెస్ లో ఉన్నారు.

సుమంత్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇకనుండి సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచనున్న ఫిలిమ్  మేకర్స్,  సినిమాపై వైడ్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.