నిఖిల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,August 10,2018 - 02:42 by Z_CLU

నిఖిల్ ‘ముద్ర’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 8 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిఖిల్ రిపోర్టర్ లా కనిపించనున్నాడు.

డిఫెరెంట్ స్టోరీ లైన్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకున్న నిఖిల్ ఈ సినిమాలో సరికొత్తగా ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అనే టాక్ ఆల్రెడీ ఈ సినిమా చుట్టూ ఫిక్స్ అయింది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సామ్ C.S. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అవురా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ L.L.P. బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా T.N సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.