మెగా హీరోయిన్ కి ఒకే ఒక్క కండీషన్ !

Saturday,March 23,2019 - 04:57 by Z_CLU

మెగా హీరోయిన్ నిహారిక సినిమా కెరీర్ పై తనకున్న కండీషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్న ఈ మెగా డాటర్ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యింది. తనకి 30 ఏళ్ళు వచ్చే  వరకే హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

పెళ్ళయ్యాక సినిమాల్లో నటించనని, ఈ లోపు కొన్ని చిన్న సినిమాలు చేస్తానని ఆ కండీషన్ మీదే హీరోయిన్ గా మారినట్టు ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చింది. తనకున్న ఈ తక్కువ టైంలో పెద్ద సినిమాలపై ఫోకస్ పెట్టకుండా మనసుకి నచ్చిన కథలతో  కొన్ని చిన్న సినిమాలు చేయాలని భావిస్తుందట. సో పెళ్ళయాక ఈ మెగా హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పనుందన్నమాట.