బిగ్ బ్రేకింగ్... మహేష్ సరసన నయనతార..?

Thursday,September 15,2016 - 01:09 by Z_CLU

ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. త్వరలోనే కలిసి నటించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మురుగదాస్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. అయితే మరో కీలకమైన పాత్ర కోసం నయనతార కోసం చర్చలు జరుపుతున్నాడట మురుగదాస్. ఓవైపు మహేష్, మరోవైపు తనకు బ్రేక్ ఇచ్చిన మురుగదాస్… కాబట్టి నయన్ ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్.

మురుగదాస్ సినిమాతో తమిళనాట గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేష్. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి మూవీలో నయనతార నటిస్తే అది కచ్చితంగా సినిమాకు, మహేష్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే.. కోలీవుడ్ లో ప్రస్తుతం నయనతార వెలిగిపోతోంది. అందుకే ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారు. చంద్రముఖితో పరిచయం అయిన నయనతారకు గజనీలో మంచి పాత్ర ఇచ్చాడు మురుగదాస్. ఆ సినిమా తర్వాత నయన్ కెరీర్ ఊపందుకుంది.