నాగార్జున మరో పెళ్లిచూపులు

Thursday,September 15,2016 - 11:01 by Z_CLU

 యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ.. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా. రామ్ గోపాల్ వర్మ నుంచి కల్యాణ్ కృష్ణ వరకు ఎంతోమందిని దర్శకులుగా వెండితెరకు పరిచయం చేశాడు నాగ్. తాజాగా కింగ్ కన్ను మరో కొత్త దర్శకుడిపై పడింది. అతడే తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు సినిమాతో ఫేం సంపాదించుకున్న ఈ దర్శకుడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు మన్మధుడు. తన బ్యానర్ లో ఓ సినిమా చేయమని, తనను హీరోగా తీసుకోవడం ఇష్టంలేకపోతే… నాగచైతన్య, అఖిల్ లో ఎవర్ని సెలక్ట్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని నాగార్జున స్పష్టంచేశాడు. రీసెంట్ గా పెళ్లిచూపులు సినిమా చూసిన నాగార్జున… తరుణ్ భాస్కర్ మేకింగ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఔట్ పుట్ తీసుకొచ్చిన తరుణ్ భాస్కర్ తో సినిమా చేయాలని వెంటనే డిసైడ్ అయ్యాడు. అందుకే ఫోన్ చేసి మరీ తరుణ్ భాస్కర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. సో… త్వరలోనే అక్కినేని హీరోల్లో ఒకరితో, తరుణ్ భాస్కర్ సినిమా చేయబోతున్నాడన్నమాట.