నయనతార 'వాసుకి' హైలెట్స్

Thursday,July 27,2017 - 12:30 by Z_CLU

నయనతార వాసుకి రేపే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్టిమేట్ ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, నయనతారకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. డ్రగ్స్, అత్యాచార నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన అంశాలు…

నయనతార : వాసుకి సినిమాలో హైలెట్స్ టాపిక్ వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది నయనతార గురించే. గ్లామర్ డాల్ గా ఎట్రాక్ట్ చేసే ఈ బ్యూటీ క్వీన్, టిపికల్ హౌజ్ వైఫ్ గా నటించిన తీరు, ఈ సినిమాని రొటీన్ థ్రిల్లర్ సినిమాల క్యాటగిరీ కన్నా నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. కథక్ డ్యాన్సర్ గా కనిపించనున్న నయన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ : వాసుకి సినిమాలో మరో హైలెటెడ్ పాయింట్. అసలు ఒక సాధారణ మహిళకు డ్రగ్స్ ఎడిక్ట్స్ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది కాస్త పక్కన పెడితే, అల్టిమేట్ రివేంజ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆద్యంతం కట్టిపడేస్తాయి.

రివేంజ్ ప్రాసెస్ : తనకు జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకోవడం సినిమాలో ఇంపార్టెంట్ పాయింట్ అయితే, ఆ ప్రాసెస్ లో క్రియేట్ అయ్యే డిఫికల్టీస్, వాటిని లీడింగ్ లేడీ ‘వాసుకి’ ఎలా ఫేస్ చేసింది అనేది సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

మ్యూజిక్ : వాసుకి సినిమాకి కథే బలం. అయితే ఆ కథని పర్ ఫెక్ట్ ఎలివేట్ చేసింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాలో ఉన్నది ఒక్క సాంగే అయినా, సిచ్యువేషనల్ ఉండే ఈ సాంగ్ సినిమాకి మంచి సపోర్ట్ నిచ్చింది.

మమ్ముట్టి : వాసుకి సినిమాలో హీరోగా నటించిన మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాకి మరో హైలెట్. నిజానికి వాసుకి సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానే అయినా, కథ నడిపేది మాత్రం హీరోనే. వాసుకి రివేంజ్ థ్రిల్లరే అయినా, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సస్పెన్స్ సినిమాలో అతి పెద్ద హైలెటెడ్ ఎలిమెంట్.

S.K. సాజన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ఓవరాల్ గా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. రేపు గ్రాన్స్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో అదరగొట్టనుందో చూడాలి.