నయనతార వాసుకి రిలీజ్ కి రెడీ

Sunday,July 23,2017 - 03:04 by Z_CLU

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన వాసుకి రిలీజ్ డేట్ ఫిక్సయింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పుదియ నియమం’ తెలుగులో వాసుకిగా ఈ నెల 28 న రిలీజవుతుంది. డ్రగ్స్, అత్యాచారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్ లోను సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.

అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో నయనతార పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద ఎసెట్ అంటున్నారు ఫిలిమ్ మేకర్స్. మరోవైపు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్, సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ‘వాసుకి’ తెలుగులోనూ అదే రేంజ్ లో సక్సెస్ అవుతుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.