Tuck Jagadish - నాని సినిమాపై పుకార్లు

Saturday,July 17,2021 - 02:15 by Z_CLU

కరోనా సెకెండ్ వేవ్ కారణంగా టక్ జగదీష్ రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, ఇతర అవాంతరాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు ఓపెన్ చేయలేదు. దీంతో టక్ జగదీష్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయలేదు.

అయితే అంతలోనే ఈ సినిమా విడుదలపై పుకార్లు మొదలయ్యాయి. ఈ నెల 30న టక్ జగదీష్ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. దీంతో వెంటనే యూనిట్ అలర్ట్ అయింది. తమ సినిమాకు సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదని, విడుదల తేదీని తమ అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు రిలీజ్ డేట్ కు, టక్ జగదీష్ ట్రయిలర్ కు నాని ఆల్రెడీ లింక్ పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ట్రయిలర్ విడుదల చేస్తే, అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నాని గతంలో క్లియర్ గా చెప్పేశాడు. దీంతో టక్ జగదీష్ నుంచి ప్రమోషన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రయిలర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి.

నాని, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, ఇది నాని-శివనిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి చేసిన నిన్నుకోరి పెద్ద హిట్టయింది. అఁదుకే టక్ జగదీష్ హాట్ కేక్ అయింది. దీనికితోడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచేసింది.

లెక్కప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పట్నుంచి ఈ క్షణం వరకు సినిమా వాయిదా పడుతూనే ఉంది.  ఐశ్వర్య రాజేష్ ఇందులో సెకెండ్ హీరోయిన్ గా నటించగా.. తమన్ సంగీతం అందించాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics