నాని, నాగ చైతన్య వచ్చేదెప్పుడు?

Thursday,August 12,2021 - 02:48 by Z_CLU

ప్రస్తుతం చిన్న సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మళ్ళీ కళకళలాడుతున్నాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమాలతో తెరుచుకున్న థియేటర్స్ ప్రతీ వారం కొత్త సినిమాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం SR కళ్యాణ మండపం సినిమా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది. కరోన ఇబ్బందుల నడుమ ఓ మోస్తారు బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజులు ఎవరూ ఊహించని విధంగా మంచి వసూళ్ళు రాబట్టింది.

ఇక ఈవారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో కాస్త బజ్ ఉన్న సినిమాగా ‘పాగల్’ ఒక్కటే కనిపిస్తుంది. ఇక ఆ పై వచ్చే వారం శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా రిలీజ్ కానుంది. ఇలా ఒక్కొక్కటిగా చిన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ మెంట్ తో రిలీజ్ కి రెడీ అవుతుంటే అసలు సెకండ్ వేవ్ కి ముందు రిలీజ్ వరకు వచ్చి పోస్ట్ పోన్ అయిన ‘టక్ జగదీష్’,’లవ్ స్టోరి’ సినిమలు మాత్రం ఇంకా సందిగ్దంలోనే ఉన్నాయి.

అవును నాని , నాగ చైతన్య ఇద్దరి సినిమాల రిలీజ్ ఇంత వరకు క్లారిటీ లేదు. టక్ జగదీష్ మొన్నటి వరకు డైరెక్ట్ OTT రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. మళ్ళీ మేకర్స్ థియేటర్ రిలీజ్ వైపే వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినబడుతుంది. దీనిపై నిర్మాత నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నాగ చైతన్య ‘లవ్ స్టోరి’ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ ఎప్పుడో చెప్పారు నిర్మాత సునీల్ నారంగ్. ప్రస్తుతానికి ఆ మాటపైనే కట్టుబడి ఉన్నారు కూడా కానీ ఇంత వరకు రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. లవ్ స్టోరి సెప్టెంబర్ లో వస్తుందా లేదా అక్టోబర్ లో రిలీజ్ అవుతుందా ? అనే కన్ఫ్యూజన్ మూవీ లవర్స్ కి ఉంది. సో అసలు సెకండ్ వేవ్ కి ముందు థియేటర్స్ రిలీజ్ అంటూ డేట్ ప్రకటించిన ఈ క్రేజీ సినిమాల నిర్మాతలు ఇప్పుడు మాత్రం రిలీజ్ విషయంలో సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు. త్వరలోనే నాని , నాగ చైతన్య సినిమాల రిలీజ్ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics