అప్పుడే మరో సినిమా రెడీ చేసిన నాని

Friday,May 17,2019 - 03:53 by Z_CLU

నిన్నమొన్నటివరకు జెర్సీతో అందరితో కంటతడి పెట్టించాడు నాని. ఆ హార్ట్ టచింగ్ మూవీ నుంచి ఆడియన్స్ ఇంకా బయటకు రాకముందే, అప్పుడే కొత్త సినిమా కబుర్లు మోసుకొచ్చాడు. అవును.. నాని కొత్త సినిమా విడుదలకు ముస్తాబైంది. ఆగస్ట్ 30న గ్యాంగ్ లీడర్ థియేటర్లలోకి వస్తోంది.

నేచురల్‌ స్టార్‌ – విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మూవీకి సంబంధించి ఇప్పటికే విడదలైన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక షూటింగ్ విషయానికొస్తే.. 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.

ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.