నాని టార్గెట్ అదే !

Sunday,April 21,2019 - 02:02 by Z_CLU

ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేసే నాని నుండి గతేడాది రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అయితే ఈ ఏడాది కచ్చితంగా ఓ మూడు సినిమాలు రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నాడు నాని. ఇప్పటికే ‘జెర్సీ’ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చిన నాని విక్రం కుమార్ చేయబోయే సినిమాతో దసరాకి రావాలని చూస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నలబై శాతం షూటింగ్ పూర్తయింది. ఇక ఇంద్రగంటి డైరెక్షన్ లో సుదీర్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఆ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనీ ఇటు నాని అటు దిల్ రాజు ఇద్దరూ ఫిక్స్ అయ్యారు.

ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి మళ్ళీ హట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు నాని. ఇప్పటికే ‘జెర్సీ’ తో బ్లాక్ బస్టర్ బోణీ కొట్టేసిన నేచురల్ స్టార్ మారి ఆ రెండు సినిమాలతో ఏ రేంజ్ హిట్ సాదిస్తాడో..చూడాలి.