బ్లాక్ బస్టర్ డైరెక్టర్ .. అంతా రెడీ !

Sunday,April 21,2019 - 12:13 by Z_CLU

ఈ ఏడాది ఆరంభంలో ‘F2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి నెక్స్ట్ మహేష్ బాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఓ యాక్షన్ డ్రామా సబ్జెక్ట్ ను సిద్దం చేసాడు అనిల్. లేటెస్ట్ గా కాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకున్నారు.

మిగతా పాత్రలకు విజయ శాంతి, జగపతి బాబు లను ఫైనల్ చేసేసారు. ఒక క్యారెక్టర్ కోసం బండ్ల గణేష్ ని కూడా తీసుకున్నారు. సినిమాలో విజయశాంతి , జగపతి బాబు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

కాస్టింగ్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ ముందుకెళుతున్నాడు అనిల్.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి రానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర కంబైన్ గా ఈ సినిమాను నిర్మించనున్నారు.