జెర్సీ : స్ట్రాంగ్ డెబ్యూ

Sunday,April 21,2019 - 03:15 by Z_CLU

‘జెర్సీ’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా శ్రీనాథ్ తన పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. జెర్సీ లో నాని పెర్ఫార్మెన్స్ తర్వాత అందరూ మాట్లాడుకుంటుంది శ్రద్దా గురించే. నిజానికి మొదటి సినిమాకే శ్రద్దా కి  ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ దొరికింది. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో నాని కి  గట్టి పోటీ ఇచ్చింది.

ఇప్పటికే కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న శ్రద్దా ‘జేర్సీ’ తో తెలుగులో కూడా సక్సెస్ ఖాతాను తెరిచింది. మరి జెర్సీ తో వచ్చిన ఈ సక్సెస్ ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందా.. చూడాలి.