జీ సినిమాలు అవార్డ్స్ .. అతి త్వరలో...

Saturday,February 11,2017 - 03:25 by Z_CLU

ఇండస్ట్రీని అవార్డుల్ని విడదీసి చూడలేం. ఇన్ ఫాక్ట్ అవార్డులు నటుడికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. తను ఎంతో కష్టపడి చేసిన పనికి గుర్తింపు లభించినందుకు సంతోషిస్తాడు. మరి అలాంటి అవార్డుల్ని స్వయంగా ప్రేక్షకులే అందిస్తే ఎలా ఉంటుంది…? ఆ నటుడి ఆనందం రెట్టింపు అవుతుంది. సరిగ్గా ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టుకొచ్చిందే జీ సినిమాలు అవార్డ్స్. ఇక్కడ అవార్డుల విజేతల్ని ఆడియన్సే నిర్ణయిస్తారు.


సౌత్ మూవీ ఛానెల్స్ లోనే తొలిసారిగా అవార్డులు ప్రవేశపెడుతోంది జీ సినిమాలు. రెగ్యులర్ గా ఇచ్చే సినీ అవార్డుల్లా కాకుండా… యూనిక్ స్టయిల్ లో ఇవి ఉండబోతున్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో పాటు.. మీ ఫేవరెట్ స్టార్స్ త్వరలోనే మీ ముందుకు రాబోతున్నారు. zeecinemalu వెబ్ సైట్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి… మీ ఫేవరెట్ స్టార్స్ కు మీరే అవార్డులు అందించండి…