మరో సినిమాకు రెడీ అవుతున్న నాని , మారుతి !

Monday,February 03,2020 - 10:01 by Z_CLU

కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ లో సినిమా అంటే ఆడియన్స్ కి ఎప్పుడూ ఎగ్జైటింగ్ గానే ఉంటాయి. అలాంటి ఓ కాంబో మళ్ళీ ఓ సినిమా కోసం కలుస్తున్నారు. నాని – మారుతి కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ నాని కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మళ్ళీ ఈ కాంబోలో సినిమా సెట్ చేస్తున్నాడు బడా నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై నాని, మారుతీలతో సినిమా తీయబోతునట్లు ప్రకటించారు నిర్మాత కే.ఎస్.రామారావు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అదే తమ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా అంటున్నాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ తో ‘టక్ జగదీష్’ చేస్తున్నాడు. మారుతి కూడా ఓ ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఈ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని సమాచారం.