పవన్ సినిమా ఎప్పుడంటే ?

Monday,February 03,2020 - 11:02 by Z_CLU

రెండేళ్ళ బ్రేక్ తర్వాత పవర్ స్టార్ తెరపై కనిపించనుండటంతో పవన్ కం బ్యాక్ సినిమా కోసం ఇప్పటి నుండే తీవ్రంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్న పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే సినిమా కథ నివేత థామస్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది.

పవన్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను అనుకున్న టైంలో పూర్తి చేసేలా టీం రాత్రి పగలు పనిచేస్తుంది. ఇక నిర్మాత దిల్ రాజు , వేణు శ్రీరాం కూడా ముందే నుండే ప్రిపేర్ అవ్వడంతో షూటింగ్ సాఫీగానే సాగుతుంది. మార్చ్ లేదా ఏప్రిల్ కల్లా టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేయాలని చూస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మే 22 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదే డేట్  లాక్ చేసుకొని ఆ దిశగా షూటింగ్ చేస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ను పెట్టబోతున్నారు. ఈ సినిమాతో బోని కపూర్ తెలుగులో నిర్మాతగా మారబోతున్నాడు.