మరో డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకున్న నాని

Sunday,October 29,2017 - 10:08 by Z_CLU

ప్రెజెంట్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘MCA ‘ సినిమాతో పాటు మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేస్తున్న నేచురల్ స్టార్ నాని మరో డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే నాని నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో హను రాఘవపూడి పాటు శ్రీరామ్ ఆదిత్య  ఉన్న సంగతి తెలిసిందే.. అయితే లేటెస్ట్ గా కిశోర్ తిరుమల తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫిక్స్ చేసుకున్నాడట నాని.

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ అందుకొని లేటెస్ట్ గా ‘ఉన్నది ఒకటే జిందగీ’ మరి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ నాని తో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని , ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం.