హనురాఘవపూడి తో నాని రెడీ.....?

Saturday,June 09,2018 - 06:00 by Z_CLU

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా తర్వాత మళ్ళీ మరో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు నాని, దర్శకుడు హను.. అయితే ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని కూడా చెప్పుకొచ్చాడు నాని.. ఇద్దరం చెరో సినిమాతో బిజీ గా ఉన్నాం.. అవి పూర్తవ్వగానే మా కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపాడు నాని…

నాని, హను  ప్రస్తుతం చెరో సినిమాతో బిజీ గా ఉన్నారు. నాగార్జున తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు నాని..అలాగే హను కూడా శర్వానంద్ తో ‘పడి పడి లెచే మనసు’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫినిష్ అవ్వగానే నాని, హను సినిమా సెట్స్ పైకి రానుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి  స్క్రిప్ట్ వర్క్  పూర్తయిందని తెలుస్తుంది…  మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లడక్ లో మొదటి షెడ్యూల్ జరుపుకోనుంది.