మైత్రి నిర్మాణంలో నితిన్ సినిమా ?

Saturday,June 09,2018 - 05:00 by Z_CLU

ప్రస్తుతం సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో  ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్నాడు నితిన్…  ఈ సినిమా తర్వాత ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు నితిన్  మరో సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది. డిఫరెంట్ మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న చంద్ర శేకర్ ఏలేటి దర్శకత్వం నితిన్ సినిమా చేయబోతున్నాడనేది ఆ వార్త.

ప్రస్తుతం ఈ సినిమాకు సమబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ  సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.  ఇంతకీ మైత్రీ లో ఈ సినిమా ఉంటుందా…లేదా అనేది తెలియాల్సి ఉంది.