నటుడి నుంచి నేచురల్ స్టార్ వరకు

Wednesday,September 05,2018 - 10:02 by Z_CLU

ఓ పదేళ్ళు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది హీరోగా నాని ఎంత ఎదిగాడన్నది… ‘రాధాగోపాళం’ సినిమాతో క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గర ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు శ్రీను వైట్ల దగ్గర ‘డీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు… నిజానికి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి హీరో అవ్వడం అనేది మాములు విషయం కాదు దానికి టాలెంట్ తో పాటు బోలెడంత అదృష్టం కావాలి.. అలా ‘అష్టాచమ్మా’ సినిమాలో హీరోగా చాన్స్ కొట్టేసాడు నాని..

సరిగ్గా పదేళ్ళ క్రితం ఇదే రోజున విడుదలైన ‘అష్టా చమ్మా’ సినిమా నానిని స్టార్ గా మార్చేసింది. రామ్మోహన్ రావు నిర్మాణంలో ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాదించి ఆల్ టైం ఎంటర్టైనర్ గా నిలిచింది.. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు నాని.

పదేళ్ళ సినిమా కెరీర్ లో నాని అందుకున్న విజయలెన్నో.. ముఖ్యంగా ‘అలా మొదలైంది’,’పిల్ల జమిందార్’,’ఎవడే సుబ్రహ్మణ్యం’,’భలే భలే మగాడివోయ్’,’కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’,’జెంటిల్ మెన్’,’నేను లోకల్’,’నిన్ను కోరి’,’MCA’లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.. వరుసగా 8 సూపర్ హిట్స్ అందుకొని ఏ యంగ్ హీరోకి సాధ్యంకాని రికార్డు సొంతం చేసుకున్నాడు.

నానిని హీరో నుంచి నేచురల్ స్టార్ ను చేసిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’ ఈ సినిమాతోనే నేచురల్ స్టార్ అనే బిరుదు అందుకున్నాడు నాని.. నాని కెరీర్ లో మరో మైల్ స్టోన్ సినిమా ‘ఈగ’. ఈ సినిమాలో నాని కనిపించింది కొంచెం సేపే అయినప్పటికీ నానికి హీరోగా ఇంటర్నేషనల్ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది. అందుకే ఇప్పటికీ ‘ఈగ’ నా ఆల్ టైం ఫేవరెట్ అంటూ చెప్తుంటాడు నేచురల్ స్టార్.

నిజానికి ఓ యంగ్ హీరో వరుసగా డబుల్ హట్రిక్ కొట్టడం అనేది మాములు విషయం కాదు. అందుకే నాని కి ఈ రేంజ్ క్రేజ్.. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి క్లాప్ అసిస్టెంట్ నుండి నేచురల్ స్టార్ గా ఎదిగిన నానికి, పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తోంది ‘జీ సినిమాలు’.