నాని ‘కృష్ణార్జున యుద్ధం’ ఎట్రాక్షన్స్

Wednesday,April 11,2018 - 02:01 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది నాని కృష్ణార్జున యుద్ధం.  బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న నాని అకౌంట్ లో మరో హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్.  రిలీజ్ కి ముందే ఆడియెన్స్ లో ఈ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మెయిన్ ఎట్రాక్షన్స్ ఇవే…

ఫస్ట్ ఎట్రాక్షన్ – నాని : ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్ నానినే. నానిని డ్యూయల్ రోల్ లో చూడటం ఫ్యాన్స్ కి కొత్త కాకపోయినా, కంప్లీట్ గా చిత్తూరు కుర్రాడు కృష్ణుడిలా న్యాచురల్ స్టార్ మరింత న్యాచురల్ గా ట్రాన్స్ ఫామ్ అయి నటించిన కృష్ణ క్యారెక్టర్, ఫ్యాన్స్  లో బాగా రీచ్ అయింది. దానికి తోడు రాక్ స్టార్ అర్జున్ లా నాని ఫుల్ ఫ్లెజ్డ్ పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద ఎసెట్ కానుంది.

సెకండ్ ఎట్రాక్షన్ – డైరెక్టర్ : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల తరవాత మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇది. కాబట్టి న్యాచురల్ గానే సినిమా స్టాండర్డ్స్ పై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకీ కృష్ణార్జునులిద్దరితో ఎందుకు యుద్ధం చేయిస్తున్నాడనే ఎలిమెంట్ ని ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్ ని మెయిన్ టైన్ చేస్తున్న ఈ ఫిల్మ్ మేకర్ సినిమాకి బ్రాండెడ్ ఎట్రాక్షన్.

థర్డ్ ఎట్రాక్షన్ – హిప్ హాప్ మ్యూజిక్ : సినిమాకి మోస్ట్ డామినేటింగ్ ఎట్రాక్షన్ హిప్ హాప్ కంపోజ్ చేసిన సాంగ్స్. ఈ సినిమా జ్యూక్ బాక్స్ నుండి ఫస్ట్ రిలీజైన ‘దారిచూడు’సాంగ్  సూపర్ హిట్టయింది. అదే వరసలో రిలీజైన అన్ని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ లిస్టులో ఈజీగా చేరిపోయాయి. అందుకే ఈ సినిమాపై ఈ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వడానికి, నాని, గాంధీ తరవాత మళ్ళీ అదే రేంజ్ లో ఎట్రాక్ట్ చేసిన ఫస్ట్ ఎవర్ రీజన్ హిప్ హాప్ మ్యూజిక్.

ఫోర్త్ ఎట్రాక్షన్ – అనుపమ & రుక్సార్ మీర్ :  అనుపమ సినిమాలకు కొత్త కాకపోయినా, నాని సరసన జోడీ కట్టడం ఇదే ఫస్ట్ టైమ్. దానికి తోడు రుక్సార్ మీర్ నాని సరసన అంతే న్యాచురల్ గా ఫిక్సయిందనిపిస్తుంది. ఈ ఇద్దరూ జస్ట్ గ్లామర్ ఆంగిల్ లోనే కాకుండా సినిమాలో ఇమోషనల్ స్పేస్ ని ఆక్యుపై చెసుకున్నట్టు తెలుస్తుంది. కృష్ణార్జునుల యుద్ధానికి వీరిద్దరూ కలర్ ఫుల్ రీజన్సే కాదు.. ఎట్రాక్షన్స్ కూడా.

ఫిఫ్త్ ఎట్రాక్షన్ – ప్రొడక్షన్ వ్యాల్యూస్ : షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. సినిమా కాస్టింగ్ దగ్గర నుండి మేకింగ్ ప్రాసెస్ వరకు ప్రతీది ఆడియెన్స్ ని స్ట్రేట్ గా రీచ్ అయ్యేలా చేసిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి మరో ఎట్రాక్టివ్ ఎలిమెంట్.