సాహోతో కలిసి వస్తున్న గ్యాంగ్ లీడర్

Tuesday,August 27,2019 - 03:47 by Z_CLU

రేపు గ్యాంగ్ లీడర్ థియేట్రికల్ ట్రయిలర్ విడుదలకానుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయబోతున్నారు. దీని కంటే ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. సాహోతో కలిసి వస్తున్నాడు గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ట్రయిలర్ ను సాహోతో పాటు థియేటర్లలో ప్రసారం చేయబోతున్నారు.

నిజానికి 30న గ్యాంగ్ లీడర్ రావాల్సింది. కానీ సాహో వాయిదాపడి ఆ తేదీకి వచ్చి చేరింది. అలా సాహో కోసం గ్యాంగ్ లీడర్ తప్పుకుంది. ఇప్పుడు సాహోతో కలిసి గ్యాంగ్ లీడర్ ట్రయిలర్ వస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. రివెంజ్ డ్రామాను హిలేరియస్ గా చూపించబోతున్నారు ఈ సినిమాలో.

గ్యాంగ్ లీడర్ కు సంబంధించి త్వరలోనే మరో ఎట్రాక్షన్ కూడా రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ ప్రోమో సాంగ్ డిజైన్ చేశారు. నాని, మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కలిసి ఈ సాంగ్ ప్లాన్ చేశారు. రీసెంట్ గా సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఆ సాంగ్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.